తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో వరదనీటి వల్ల కొన్ని ఇళ్లులు కుప్పకూలాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయి కాలువలను తలపిస్తున్నాయి. ఇక మరో 48 గంటల పాటు మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగతా చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరిలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకి వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు.