ఏపీలో “రేషన్ కార్డ్” ఉన్న వారికి కీలక ప్రకటన !

-

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ప్రజలకు రేషన్ సరుకులను అందించడంలో క్వాలిటీ ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా జులై నెల నుండి పోర్టిఫైడ్ క్వాలిటీ గోధుమ పిండిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గోధుమ పిండిని నెలనెలా బియ్యం మరియు పంచదారతో పాటుగా కలిపి సరఫరా చేస్తోంది. కానీ ఆ పౌరసరఫరాల శాఖ రిపోర్ట్ ప్రకారం చూస్తే… 128 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, నగర పంచాయితీలు లలో మొత్తం 36 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న వారికి ఈ గోధుమ పిండిని ఒక కేజీ కేవలం రూ. 16 లకు అందించారు. కానీ ఇప్పటి వరకు చూస్తే కేవలం రూ. 7 .82 లక్షల మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారట. ఇంకా తీసుకోవలసిన వారి సంఖ్య సగానికి పైగానే ఉందని ఈ శాఖ అధికారులు తెలియచేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు ఉన్న అందరూ ఈ గోధుమపిండిని తీసుకోవలసిందిగా అలెర్ట్ ఇచ్చారు.

మరి వెంటనే మీ దగ్గరకు వస్తున్న రేషన్ బండి నుండి గోధుమ పిండిని అతి తక్కువ ధరకే తీసుకుంటారని కోరుకుంటున్నాము.

Read more RELATED
Recommended to you

Latest news