ఆలీ కూడా స్టార్ట్..పవన్ టార్గెట్‌గానే..!

-

ఏంటో మరి రాజకీయాల్లో పదవులు వచ్చిన నేతలు..ప్రత్యర్ధులని తిట్టడానికే అన్నట్లు పనిచేస్తున్నారు. అంటే ప్రత్యర్ధులని తిడితినే పదవులు అనే పాలసీని అధికార పార్టీలు గట్టిగా ఫాలో అవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులని ఎంత గట్టిగా తిడితే..అంత ఎక్కువగా పదవి వచ్చే ఛాన్స్ గాని, పదవి నిలిచే ఛాన్స్ గాని ఉందని చెప్పొచ్చు.

ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇదే పాలసీని బాగా ఫాలో అవుతుంది. ఉండటానికి 25 మంత్రులు ఉన్నారు..కానీ ఎవరు ఏ శాఖకు సంబంధించి పనిచేస్తున్నారు..వారి శాఖల్లో జరుగుతున్న పనులు అనేవి ప్రజలకు తెలియదు గాని..వారు ప్రతిపక్ష నేతలని తిట్టడం మాత్రం తెలుసు. ఇలా పదవులు ఉన్న ప్రతి నాయకుడు..సీఎంకు భజన చేయడం, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం.

ఇదే క్రమంలో సినీ నటుడు ఆలీ సైతం..అదే దారిలో ముందుకెళ్లడం మొదలుపెట్టారు. సినీ ఇండస్ట్రీలో పవన్ స్నేహితుడుగా ఉన్న ఆలీ..వైసీపీలో చేరిన తర్వాత..ఆయన రాజకీయం మారింది. ఇక తాజాగా ఆయనకు ఏపీ ఎలక్ట్రానిక్  మీడియా సలహాదారు పదవి వచ్చింది. తాజాగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన వెంటనే..జగన్ ప్రభుత్వం గురించి భజన చేయడం మొదలుపెట్టారు. ఇక  తనకు తెలిసి ఆ ఆరోపణలు కరెక్ట్ కాదని, పవన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

త్వరలోనే పవన్ కల్యాణ్ నన్ను పిలుస్తారు: అలీ | comedian ali comments on janasena chief pawan kalyan - Telugu Oneindia

ప్రజల ఆదరణ పొందిన పార్టీ వైసీపీ అని, ప్రజలు 151 సీట్లు ఇచ్చారని,  “మీ పాలన బాగుంటుంది. అద్భుతం అవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది” అని  ప్రజలు నమ్మారని,  విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్నిచోట్ల అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇక వైజాగ్ బీచ్ రోడ్లు, అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని మాట్లాడారు. అయితే రాష్ట్రం బాగుండాలనే ప్రజలు జగన్‌ని గెలిపించారు..మరి బాగుందా? అంటే అది ప్రజలని ఆలీ అడిగి తెలుసుకుంటే బెటర్ అని ప్రతిపక్ష శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి.

ఏపీలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో ఆలీ చూపించాలని అంటున్నారు. పదవి ఇచ్చిందే పవన్‌ని తిట్టడానికని, అందుకే ఆలీ తన బాధ్యతలు నెరవేస్తున్నారని జనసేన శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి పదవి రాగానే ఆలీ కూడా ప్రతిపక్షాలపై విమర్శలు స్టార్ట్ చేసేశారు.

Read more RELATED
Recommended to you

Latest news