తాగుబోతుల మీద ఆధారపడిన ప్రభుత్వాలు…?

-

ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అనేది వాస్తవం. వారికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తమకు ఆదాయ మార్గాల మీద ఇప్పుడు ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ప్రజలు అందరూ కూడా ఆర్ధిక కష్టాల్లో ఉండటంతో వారికి సహాయం చెయ్యాల్సిన అవసరం అనేది ప్రభుత్వాలకు ఉంది. అది ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ఎక్కువగా అప్పులు చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.

అయితే నిత్యావసర సరుకుల కోసం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే అనుమతులు ఇచ్చిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యానికి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతి ఇవ్వడం నిజంగా విడ్డూరం. తినటానికి తిండి లేదు అని ఆర్ధిక సహాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడమే కాదు 70 శాతం వరకు ధరలు పెంచాయి. ఒక్క తెలంగాణా మాత్రమే 16 శాతం పెంచింది. మద్యం అమ్మకాల ద్వారా ఇప్పుడు రాష్ట్రాలకు భారీగా ఆదాయం వస్తుంది అనేది అర్ధమవుతుంది.

ఒక పక్కన ఏమో తాగొద్దు జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పడం గమనార్హం. తాగుబోతుల నుంచి వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయడం గమనార్హం. ఏపీ సర్కార్ మద్యపాన నిషేధం అని చెప్తుంది. మద్యపాన నిషేధం అని చెప్పిన సర్కార్ ఇప్పుడు ధరలు పెంచుతుంది. ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. మద్యం ధరలను పెంచితే మద్యం తాగకుండా ఉంటారు అనేది అబద్దం. ఎక్కడో ఒకరు ఇద్దరు మినహా భార్యలను వేధించి తాగే జనాలు ఎక్కువ. ఏది ఎలా ఉన్నా మద్యం విషయంలో రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకే అర్ధం కావాలి.

Read more RELATED
Recommended to you

Latest news