మదర్స్ డే మే రెండో ఆదివారం రోజునే ఎందుకు జరుపుకుంటారు?

-

దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే.. అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. అందుకే అమ్మకు అంత విలువ. తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. తను కడుపు మాడ్చుకొని తన కన్నబిడ్డల కడుపు నింపుతుంది అమ్మ. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా మే 12న ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మనలోకం పాఠకుల కోసం…

happy mothers day 2019

ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్నే ప్రపంచ మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. అయితే.. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారాన్నే ఎందుకు మాతృదినోత్సవంగా జరుపుకోవాలి.. అసలు మదర్స్ డేను ఎందుకు జరుపుకుంటారు. అది ఎలా పుట్టింది.. అంటే దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం తెలుసుకోవాల్సిందే.

గ్రీస్‌లో రియా అనే దేవత ఉండేది. ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్ అని పిలిచేవారు. ఆ దేవతకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించేవారు. అదే విధంగా 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో మాతృమూర్తులను గౌరవిస్తూ… మదరింగ్ సండే పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత 1872 లో జూలియవర్డ్ హోవే అనే మహిళ.. మదర్స్ డేను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆమె అమెరికాలో ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచం శాంతంగా ఉండాలంటే మనల్ని కన్న మాతృమూర్తులను తరించుకోవాలని విన్నవించింది.

happy mothers day 2019

అలా.. మదర్స్ డే జరపాలనే ఆలోచనలకు బీజం పడింది. తర్వాత అన్న మేరీ జర్విస్ అనే మహిళ కూడా మదర్స డే కోసం పోరాడింది. కాకపోతే.. ఆమె బతికుండగా మదర్స్ డేను ఏర్పాటు చేయలేకపోయారు. ఆమె 1905 మే 9న మృతి చెందింది. దీంతో ఆమె కూతురు మిస్ జెర్విస్ మదర్స్ డే కోసం చాలా ప్రయత్నించింది. అలా.. 1911 నుంచి అమెరికాలో మాతృదినోత్సవం జరుపుతున్నారు.

కాకపోతే.. 1914 నుంచి దాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం స్టార్ట్ చేశారు. తర్వాత అది ప్రపంచమంతా విస్తరించింది. మాతృమూర్తులకు ఓ రోజును కేటాయించడం గొప్పే కదా అనుకొని ప్రతి దేశం కూడా మాతృదినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. అలా.. మే రెండో ఆదివారాన్ని ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అది మదర్స్ డే ప్రాముఖ్యత, చరిత్ర.

Read more RELATED
Recommended to you

Latest news