ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధినేత మాజీ సిఎం చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు ఎంత అనుభవం ఉన్నా సరే సిఎం వైఎస్ జగన్ విషయంలో మాత్రం ఆయన అనుకున్నది ఏ ఒక్కటి జరగడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. రాజకీయాల్లో చంద్రబాబు ఎన్నో ఎత్తులు చూసారు గాని ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం ఆయన లోతులు మాత్రమే చూస్తున్నారు. జగన్ ఏ విధంగా ఆలోచన చేస్తారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు, అలాగే ఆయన వ్యూహాలు ఏంటీ అనేది కూడా తెలియడం లేదు.
ఇప్పుడు దాదాపుగా చంద్రబాబు అంచనాలకు కూడా జగన్ వ్యూహాలు అందడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విశాఖ ప్రమాదం విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు. జగన్ భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. కంపెనీ నుంచి తాను ఇప్పిస్తా అనే హామీని జగన్ ప్రజలకు ఇచ్చారు. ఇది రాజధాని తరలింపు విషయంలో కూడా జగన్ కి ప్లస్ అయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు అక్కడి ప్రజల్లో మద్దతు రావడం ఖాయంగా కనపడుతుంది.
ఇప్పుడు ఇదే చంద్రబాబుకి కూడా బాగా ఇబ్బంది గా మారింది అనేది వాస్తవం. జగన్ ని ఈ విషయంలో చంద్రబాబు చాలా తక్కువగా అంచనా వేసారు అనేది రాజకీయ పరిశీలకుల మాట. అటు కేంద్రం కూడా జగన్ నిర్ణయం చూసి షాక్ అయింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితుల్లో అంత భారీ సాయం ప్రకటించే అవకాశం దాదాపుగా లేదు. కాని జగన్ మాత్రం వెనకడుగు వేయకుండా కంపెనీ ఇవ్వకపోయినా ప్రభుత్వం ఇస్తుంది అని స్పష్టంగా చెప్పడమే కాకుండా ఒక కమిటి ని కూడా వేసారు.