దేశం కాని దేశం వెళ్లి ముక్కు ముఖం తెలియని మనుషుల మధ్య ఎంతో మంది కుటుంబ పోషణ కోసం పిల్లల భవిష్యత్తు కోసం పొట్ట చేతపట్టుకుని వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతదేశం నుంచి విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా ఉపాధి నిమిత్తం వెళ్ళిన ఏదో ఒక కారణం ద్వారా ప్రాణాలు కోల్పోయి చివరికి కుటుంబానికి కడ చూపు కూడా నోచుకోకుండా ఉంటుంది. కనీసం తమ ప్రియమైన వారి కడచూపు కూడా నోచుకోలేక కుటుంబం శోక సముద్రంలో మునిగి పోతుంటారు.
ఇలాంటి వారి విషయంలో ఇక్కడ ఒక వ్యక్తి ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. దేశం కాని దేశం పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది మృతదేహాలను స్వగ్రామాలకు చేరుస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. కేరళకు చెందిన అఫ్రాష్ అనే వ్యక్తి యూకేజీ లో స్థిరపడ్డాడు. ఇక అక్కడ యూఏఈ కి భారతదేశం నుంచి పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది భారతీయులమృతదేహాలను స్వగ్రామాలకు తన సొంత ఖర్చులతో పంపిస్తున్నాడు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు 5700 మృతదేహాలను స్వగ్రామాలకు పంపించాడు సదరు వ్యక్తి.