ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లు వరుసగా మ్యాచ్ లలో విఫలం అవుతున్నప్పటికీ..యువ ఆటగాళ్లను కాదని కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లకు జట్టులో అవకాశం కల్పిస్తుండటం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిన్న రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా మరోసారి కేదార్ జాదవ్ కి అవకాశం కల్పించాడు మహేంద్రసింగ్ ధోని.
కేదార్ జాదవ్ అంతలా రాణించలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన ధోని యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని అందుకే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం లేదు అంటూ చెప్పాడు. దీనిపై స్పందించిన భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోనీకి చురకలు అంటించాడు. యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించడం లేదుa సరే.. పేలవ ప్రదర్శన చేస్తున్న కేదార్ జాదవ్ లో మాత్రం ధోనీకి స్పార్క్ కనిపిస్తుందా అంటూ ప్రశ్నించాడు మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్.