క్రెడిట్ కార్డు తీసుకువస్తున్న పేటీఎం.. కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్స్!

-

డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ‌ఫామ్ పేటీఎం ఇప్పుడు తన కస్టమర్లకు అదిరిపోయే తీపి కబురు అందించింది. సరికొత్తగా క్రెడిట్ కార్డును తీసుకువస్తున్నట్లు ప్రకటించింది పేటీఎం. దాదాపుగా 20 లక్షల క్రెడిట్ కార్డులను అందించాలని లక్ష్యంగా, వచ్చే 12 – 18 నెలల సమయంలోనే ఈ టార్గెట్ చేరుకోవాలని భావిస్తోంది పేటీఎం సంస్థ. మొబైల్ వాలెట్, డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ‌ఫామ్ పేటీఎం ప్రస్తుతం క్రెడిట్ కార్డు మార్కెట్ ‌పై కన్నేసింది. అందుకే వినూతనంగా కో – బ్రాండెడ్ క్రెడిట్ కార్డును మార్కెట్లోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది.పేటీఎం ఇప్పటికే ఈ అంశంపై అనేక బ్యాంకులతో చర్చించారు. క్రెడిట్ కార్డు తీసుకురానున్న పేటీఎం. దీంతో అనేక బెనిఫిట్స్ లభిస్తాయని అంటున్నారు. యాప్ ద్వారానే అప్లై చేసుకోనే సౌలభ్యం కల్పిస్తున్నారు.

పేటీఎం తన యాప్ ద్వారా తమ కస్టమర్లకు సరికొత్త డిజిటల్ అనుభూతిని కలిగించాలని ఆలోచనతో కొత్త క్రెడిట్ కార్డును తీసుకురానుంది. కస్టమర్స్ వారి కార్డుపై పూర్తి కంట్రోల్ కలిగి ఉండొచ్చు. కొత్త క్రెడిట్ కార్డు కోసం పేటీఎం బ్యాంక్ కార్డు జారీ సంస్థలతో జతకట్టనుంది. ఆ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా కొత్త పేటీఎం క్రెడిట్ కార్డులను తీసుకురాబోతోంది పేటీఎం. ఈ పేటీఎం క్రెడిట్ కార్డులో ఇన్‌స్టంట్ వన్ టచ్ ఫీచర్స్ ఉంటాయి. సెక్యూరిటీ పిన్ నెంబర్, అప్డేట్ అడ్రస్, బ్లాక్ కార్డు, ఇష్యూ డూప్లికేట్ కార్డు, కార్డు బిల్లు మొత్తం వంటి సర్వీసులు అన్నింటినీ కూడా పొందొచ్చు. ఇంకా కార్డును ఆన్ లేదా ఆఫ్ చేసుకోనే ఫీచర్ కూడా ఇస్తుంది పేటీఎం. కార్డుపై అంతర్జాతీయ లావాదేవీలను కూడా చేసుకోవచ్చు.

ఇంకా పేటీఎం క్రెడిట్ కార్డుపై ఇన్సూరెన్స్ సేవలను కూడా కస్టమర్లు పొందవచ్చు. పేటీఎం యాప్ ద్వారానే ఈ సర్వీసులు అన్నీ కూడా వారు పొందొచ్చు. పేటీఎం క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవటం నుండి కార్డు జారీ వరకు అన్ని సర్వీసులు యాప్ ద్వారానే జరుపుకోవచ్చు. ఇంకా రివార్డు పాయింట్లు, క్యాష్ ‌బ్యాక్స్, డిస్కౌంట్లు వంటివి కూడా కస్టమర్లు పొందొచ్చు. రివార్డు పాయింట్లకు ఎక్స్‌పైరీ ఉండదు. ఈ రివార్డు పాయింట్స్ తో పేటీఎం యాప్ ‌లో హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news