నెపోటిజంపై ఘాటుగా స్పందించిన అల్లు అరవింద్..!

-

తాజాగా బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 నాల్గవ ఎపిసోడ్ కి సంబంధించి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు హాజరవగా ప్రముఖ దర్శకులైన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు హాజరయ్యారు .ఈ ఐదుగురి మధ్య సినిమా విషయాలు ప్రస్తావనకు రాగా మరెన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే నెపోటిజం అనే అంశంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు అల్లు అరవింద్. అంతేకాదు నెపోటిజం అనేది ఏ రంగంలో లేదో గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అంటూ ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా అన్ స్టాపబుల్ షోలో భాగంగా ప్రతి ప్రశ్నకు బదులిస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలను అల్లు అరవింద్ చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే నెపోటిజం టాపిక్ రావడంతో అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. నెపోటిజంపై మీ అభిప్రాయాలు చెప్పండి అని బాలయ్య ప్రశ్నించడంతో వెంటనే రియాక్ట్ అయిన అల్లు అరవింద్.. నెపోటిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి.. ఒకవేళ వారికే ఇలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా? అంటూనే లేదు కదా తెలిపారు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో అదే వృత్తిపై ఇంట్రెస్ట్ ఉండడం కామన్. అలాగే టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ చూసిన మార్గం ఎంచుకోవడంలో తప్పేమీ లేదు కదా.

అయినా ఒక సినీ ఇండస్ట్రీ నే కాదు డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్ మాన్ , లాయర్ ఇలా అన్ని వృత్తుల్లో ఉన్నవారు కూడా తమ పిల్లలను అదే వృత్తిలో సెట్ చేయడం లేదా.. మరి అది నెపోటిసం అనపడదా అంటూ అల్లు అరవింద్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.. ఇదే విషయంపై సురేష్ బాబు కూడా స్పందిస్తూ నెపోటిజం అనేది కేవలం ఆరంభం మాత్రమే.. స్టార్ గా ఎదగాలంటే టాలెంట్ ఉండాల్సిందే. వారసత్వం వల్లే స్టార్ అవుతారు అనడం తప్పు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news