మాస్టారూ మీరు సూపర్ అంతే.. ఏకంగా గిన్నిస్ రికార్డు..

-

గిన్నిస్ లో చోటు దక్కాలి అంటే ఎవరూ చెయ్యని పని చెయ్యాలి..ఏదైనా వింతగా ఉండాలి..ప్రపంచం మెప్పును పొందాలి అప్పుడే రికార్డును బ్రేక్ చేస్తారు.ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు..అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి కేవలం వెంట్రుకలను పెంచి రికార్డ్సు ను సొంతం చేసుకున్నాడు..

 

మగ వాళ్లైనా సరే ఆడవారిలా జుట్టు భారీగా పెంచుతారు. మహిళల మాదిరిగానే జడలు వేసుకుంటున్నారు. వెరైటీగా కనిపించేందుకు, ఏదో ఒక ప్రత్యేకత తమలో ఉందనే విషయం చాటుకునేందుకు ఈ ఫ్యాషన్ పోకడలను అనుసరిస్తున్నారు.

ఇక విషయాన్నికొస్తే.. ఓ వ్యక్తి విచిత్రంగా తన చెవిలో వెంట్రుకలు భారీగా పెంచాడు. ఈ విషయంలో ఆయన ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. పొడవైన చెవి వెంట్రుకలతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నాడు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.భారతదేశానికి చెందిన రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెవిలో పొడవాటి వెంట్రుకలను కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించగలిగారు.

 

ఆ వ్యక్తి ఆంటోనీ విక్టర్. రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అతడిది తమిళనాడు లోని మధురై ప్రాంతం. అతని చెవి వెంట్రుకలు బాగా పొడవుగా ఉంటాయి. ఇటీవల వాటిని కొలవగా ఏకంగా 18.1 సెంటీమీటర్లు, అంటే 7.12 అంగుళాలు ఉన్నాయి. అతను 2007 నుండి తన చెవిలో పొడవైన వెంట్రుకలను పెంచుతూ వస్తున్నాయి. గత 15 సంవత్సరాలలో అతని రికార్డును ఎవరూ అధిగమించలేక పోయారు. ఆంటోనీ విక్టర్ సాధించిన విజయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది..

అతని వెంట్రుకలు చూసి అందరూ నవ్వేవారు..చెవిలో బొచ్చు టీచర్” అని పిలిచేవారు. ఇక ఆయనకు గిన్నిస్ రికార్డు వచ్చిందని తెలియగానే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాటికి ప్రపంచ రికార్డు వచ్చిందని తెలియగానే తామంతా పెంచి రికార్డులను అందుకుంటామని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news