సీత కోసం టాలీవుడ్ లో యుద్ధం !

435

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా 1500 కోట్ల రూపాయాల‌తో రామాయ‌ణాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే దానిపై అప్ డేట్ కూడా ఇచ్చారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌లో ఇండియన్ సినిమా గా రికార్డుకు ఎక్క‌బోతుంది. అత్యాధునిక సాంకేతిక త్రీడీ టెక్నాల‌జీతో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు నితీష్ తివార్-ర‌వి ఉద్య‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాకు మ‌రింత క్రేజ్ ఏర్ప‌డుతోంది. అయితే ఇందులో న‌టీన‌టులు ఎవ‌రు? ఎవ‌రు రాముడు? ఎవ‌రు ల‌క్ష్మ‌ణుడు? ఎవ‌రు రావ‌నాసురుడు? ఎవ‌రు సీత! వంటి డిటైల్స్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సీత పాత్ర కోసం అప్పుడు టాలీవుడ్ లో యుద్ధం మొద‌లైన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

allu aravind search for Sita characterIn ramayana movie

ఈ రేసులో ఇద్ద‌రు పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. వాళ్లెవ‌రో కాదు. హాట్ బ్య‌టీ న‌య‌న‌తార‌, స్వీటీ అనుష్క‌. ఎలాగైనా సీత రోల్ ద‌క్కించుకోవాల‌ని ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఉప్పందింది. మేక‌ర్స్ ఇద్ద‌రి పేర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డంతో ఈ లీక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఆ అవ‌కాశం ఎవ‌రికి వరిస్తుంది? అన్న‌ది సెకెండ‌రీ గానీ….ఆ పాత్ర‌కు మాత్రం ఇద్ద‌రు స‌రితూగే వారే . న‌య‌నతార‌కు ఇప్ప‌టికే సీత పాత్ర పోషించిన అనుభ‌వం ఉంది. శ్రీరామ రాజ్యం సినిమాలో సీత పాత్ర‌లో ఒదిగిపోయింది. రాణీ త‌ర‌హా పాత్ర‌ల ఆహార్యం న‌య‌న్ కు బాగా సూట‌వుతాయి. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి లో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి స‌తీమ‌ణి పాత్ర‌లో న‌టిస్తోంది.

రిలీజ్ త‌ర్వాత మ‌రింత గుర్తింపు వ‌స్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్వీటీ దేవ‌స‌న‌గా ప్ర‌పంచానికి సుప‌రిచితురాలు. బాహుబ‌లి సినిమాలో కుంత‌ల దేశ‌పు యువ‌రాణిగా ఆక‌ట్టుకుంది. యువ‌రాణినే దిగొచ్చిందా? అన్నట్లుగా అద‌ర‌గొట్టింది. సీత పాత్ర‌కు కావాల్సినన్నీ స్వీటీలో ఉన్నాయి. కాబ‌ట్టి ఆమెను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డానికి లేదు. మూడు భాష‌ల్లో తీస్తోన్న‌ తెలుగు సినిమా కాబ‌ట్టి ద‌ర్శ‌కులు వీళ్లిద్ద‌ర్నీ కాద‌ని బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి. సీతగా వీళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని ఎంపిక చేసుకునే ఉంది. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.