ర‌జ‌నీకాంత్ పై సుహాసిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

413

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ విశ్వ‌వ్యాప్తం. ఆయ‌న సినిమాలంటే 500 కోట్లు కొల్ల‌గొట్టాల్సిందే. చైనా, జ‌పాన్, మ‌లేషియా, థాయ్ లాండ్ లో సూప‌ర్ స్టార్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. క‌ర్ణాట‌క రాష్ర్టా వారైన త‌మిళ తంబీల ఆరాధ్య న‌టుడు. ఇక తెలుగు రాష్ర్టాల్లో ర‌జనీ మేనియా గురించి మాట‌ల్లో చెప్ప‌లేం. అలాంటి న‌టుడిపై మ‌ణిర‌త్నం స‌తీమ‌ని, సీనియ‌ర్ న‌టి సుహాసిని సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసింది. ఆయ‌న‌కు అస‌లు యాక్టింగ్ రాదు. మా ఇంటి వెనుక దొంగ‌లా వ‌చ్చి భ‌య‌ప‌డుతూ సిగ‌రెట్లు కాల్చేవారు. ఆయ‌న ఇప్పుడు పెద్ద స్టార్. ప్ర‌పంచాన్నే ఏల్తున్నారని అంది.

suhasini sensational comments on Rajinikanth

ఇంత‌కీ ర‌జ‌నీపై సుహాసిని ఈ రేంజ్ లో మాట్లాడ‌టానికి కార‌ణం ఏంటి? వాళ్లిద్ద‌రి మ‌ధ్య విబేధాలు ఏంటి అనుకుంటున్నారా? అయితే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కె. బాల చంద‌ర్ 89వ జ‌యంతి కార్య‌క్ర‌మం ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కోలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలోనే సుహాసిని ర‌జనీ గురించి ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. తొలి రోజుల్లో ర‌జ‌నీకాంత్ ఎవ‌రో నాకు తెలియ‌దు. తెలిసిన త‌ర్వాత ఆయ‌న‌కు న‌టించ‌డం తెలియ‌ద‌ని అర్ధ‌మైంది. ఎక్కువ‌గా భ‌య‌ప‌డేవారు. నేను తొలి సారిగా చూసిన సినిమా మూండ్రు ముడిచ్చు. ఆ సినిమా షూటింగ్ మా ఇంటి స‌మీపంలోనే జ‌రిగింది. ర‌జ‌నీకి ప‌రిశ్ర‌మ కొత్త‌. ప్ర‌తీ దానికి భ‌య‌పడేవారు.

ఎవ‌రితోనూ మాట్లాడేవారు కాదు. బాల‌చంద‌ర్ ర‌జ‌నీకి టెర్ర‌ర్. షూటింగ్ బ్రేక్ స‌మ‌యంలో మా ఇంటి వెనుక త‌లుపు ప‌క్క‌న నుంచొని గుప్పు గుప్పు మంటూ పొగ తెగ వదిలేవారు. అప్పట్లో ర‌జీని కి కెమెరా లుక్ పెట్ట‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కింద చూడు..పైన చూడు అంటూ బాల‌చంద‌ర్ మెత్తుకునే వారని తెలిపారు. అంతేకాదు బాల‌చంద‌ర్ చెప్ప‌డం వ‌ల్లే మ‌ణిర‌త్నం ను పెళ్లి చేసుకున్నాన‌ని లేక‌పోతే పెళ్లాడే దాన్ని కాద‌ని తెలిపింది. దీంతో అంటే మ‌ణిర్న‌తం-సుహాసినిది ప్రేమ పెళ్లి కాదా? అన్న అనుమానం అంద‌రిలో మొద‌లైంది.