ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపుతున్న ‘అల వైకుంఠపురములో’

-

దుమ్మురేపుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో . గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు లిరికల్ సాంగ్స్ మరియు ఒక వీడియో ప్రోమో సాంగ్, శ్రోతల ను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా అదరగొడుతూ ముందుకు సాగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఒక బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ నేడు అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ హక్కులు కూడా అత్యధిక ధరకు అమ్ముడుపోయాయి. అయితే ఈ సినిమా హక్కులు కూడా ఇంచుమించు అదే ధరకు అమ్ముడు అయినట్లు సమాచారం. ఓవర్సీస్ లో బన్నీతో పాటు త్రివిక్రమ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉండడంతో, ఇంత భారీ ధరకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు చెప్తున్నారు.

Allu Arjun Ala Vaikunthapuramulo Movie Business Details
Allu Arjun Ala Vaikunthapuramulo Movie Business Details

బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళి శర్మ, బన్నీ తండ్రి పాత్రలో నటిస్తుండగా, ఆయన అక్క పాత్రలో సీనియర్ నటి టబు నటిస్తున్నట్లు సమాచారం. అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా ఎస్ వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా భారీ లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version