ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సు కి అప్లై చేసిన అల్లు అర్జున్

-

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్కి వచ్చారు.విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా బన్నీ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.

కాగా, పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news