గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీలో నుంచి ఒకరి తర్వాత మరొకరు వేరే పార్టీలోకి చాలామంది నాయకులు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మంచిర్యాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ రాజీనామా చేశారు.ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కూడా అదే బాటలో వెళ్లే యోచన చేస్తున్నారు. ఆయన తనతోపాటు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను తీసుకెళ్లాలని ప్రయత్నించినా, అందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధంగా లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సతీశ్ కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చడం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆయన తెలిపారు.