ఆమె పెళ్లి అయ్యినప్పుడు బన్నీ చాలా బాధపడ్డారట..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ హీరోగా మారారు. ఆర్య, బన్నీ, దేశముదురు ఇలా చాలా సినిమాల్లో నటించి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వచ్చిన పుష్ప సినిమా అయితే పెద్ద హిట్ అయింది. ఇప్పుడు పుష్ప సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు పుష్ప టు సినిమా కూడా హిట్ అవుతుందని పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ కి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అంటే ఎంతో అభిమానమట. ఐశ్వర్యరాయ్ పెళ్లి అయినప్పుడు అల్లు అర్జున్ ఎంతగానో బాధపడ్డారట ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా చెప్పారు. అల్లు అర్జున్ పెళ్లి సందర్భంగా చాలా మంది అమ్మాయిలు బాధపడిన విషయం తెలిసిందే పైగా బన్నీకి మెసేజ్లు కూడా చేశారట అటువంటప్పుడు బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసు అని ఐశ్వర్య విషయాన్ని చెప్పారు అల్లు అర్జున్.

Read more RELATED
Recommended to you

Exit mobile version