మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయవంతం అయ్యింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కర్రిగుట్టల్లో మావోయిస్టు పెద్ద లీడర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించడంతో అక్కడ 25 వేల మంది బలగాలను మోహరించారు.దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం. కర్రిగుట్టలో మావోయిస్టుల బంకర్‌ను బలగాలు గుర్తించాయి.
తాజాగా కర్రెగుట్టలపై ఓ జవాన్ జాతీయ జెండాను ఎగరేశారు.కర్రెగుట్టలపై తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. దీంతో బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కర్రెగుట్టలపై జాతీయ జెండా
కర్రెగుట్టలపై తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో… pic.twitter.com/eMmr5a9Fk1
— ChotaNews App (@ChotaNewsApp) April 30, 2025