రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ అద్దిరిపోయే గిఫ్ట్ … !

-

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల మనుమరాలు జన్మించిన విషయం తెలిసిందే. ఈమెకు నాన్న రామ్ చరణ్ మరియు అమ్మ ఉపాసనలు ఎంతో ప్రేమతో క్లిన్ కారా అని పేరు పెట్టుకున్నారు. ఈ బుల్లి మెగాస్టార్ కు వరుసగా ఇండస్ట్రీ హీరోల దగ్గర నుండి బహుమతులు వస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఒక మంచి సర్ ప్రయిజ్ ను క్లిన్ కారాకు అందించారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కొణిదెలవారమ్మాయికి బంగారు పలకను బహుమతిగా ఇచ్చారట. అయితే ఎవ్వరూ ఊహించని ఈ సర్ ప్రయిజ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆ బంగారు పలకపై పాప పేరు మరియు పుట్టినతేదీ వివరాలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడట అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అభిమానులు అయితే పుష్ప .. WHAT A SURPRISE అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ మధ్యనే ఎన్టీఆర్ సైతం ఆమెకు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news