ఎలా బతికినా.. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మాత్రం ఘనంగానే చేస్తారు. తినడానికి లేక చనిపోయిన వారి అంత్యక్రియల రోజు కూడా పదిమందికి అన్నం పెట్టే సంప్రదాయం మనది. వారి ఆత్మశాంతించాలని అలా చేస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఆత్మ బాధపడకూడదని ప్రతి మతంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు. కొందరు పూడ్చిపెడతారు, కొందరు కాలుస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మ త్వరగా మోక్షం పొందుతుందని నమ్ముతారు.
కానీ కొన్ని ఘటనలు చూస్తే.. ఆ చనిపోయిన వారిచావు ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది. అనాథశవాలకు కూడా ఎన్జీవోలు అంత్యక్రియలు చేస్తారు. అలాంటిది ఇక్కడ ఒక మృతదేహాన్ని కాల్చుతుంటే.. వరద వచ్చి చితీతో సహా కొట్టుకుపోతే.. ఆ సగం కాలిన మృతదేహం పరిస్థితి ఏంటి..? ఆ వ్యక్తి మొక్షం ఎటుపోవాలి..? ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లో ఓ వ్యక్తి చనిపోవడంతో బంధువులు వచ్చి శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. అన్ని పూజల అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. కాలిపోతున్న మృతదేహం దగ్గర కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అందరూ ఒడ్డున చూస్తూ నిలబడ్డారు. అయితే అకస్మాత్తుగా బలమైన నీటి ప్రవాహం వచ్చింది. ఈ ఉప్పెనను చూసి అందరూ పక్కదారి పట్టారు. కాలిపోతున్న మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మృతదేహం ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అసలు నది మధ్యలో ఎందుకు మృతదేహాన్ని తగలుబెట్టారు. వాళ్లకు తెలివిలేదా..అతనికి మోక్షం లభించిందని చాలామంది కామెంట్ చేశారు. గంగామాత స్వయంగా ఆయనను తీసుకెళ్లడానికి వచ్చిందని కొందరు కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.
View this post on Instagram