ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన హై లెవెల్ మీటింగ్ లో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా టార్గెట్ ఫిక్స్ చేశారు. త్వరలో తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 75 అసెంబ్లీ స్థానాలకు గానూ అన్ని సీట్లు బీజేపీ గెలుచుకోవాలని చెప్పాడు. ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డితో సహా ఎంత పెద్ద నాయకుడు అయినా ఖచ్చితంగా అసెంబ్లీ బరిలోకి దిగాల్సిందే అంటూ కండిషన్ పెట్టాడు అమిత్ షా. తెలంగాణ రాజకీయాల పట్ల కేంద్రం చాలా సీరియస్ గా మరియు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే ఇకపై తెలంగాణాలో రాజకీయ నిర్ణయాలు అన్నే ఢిల్లీ నుండే తీసుకోవడం జరుగుతాయని అమిత్ షా చెప్పాడు. ఢిల్లీ లో తెలంగాణ బీజేపీ పేరు మీద ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేసి అందులో నుండి స్థానిక నేతలతో సమన్వయము చేస్తూ ఉంటామని అమిత్ షా ఆర్డర్ పాస్ చేశాడు.
బీజేపీ అధిష్ఠానము కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యాలు చేసినా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హుకుం జారీ చేశారు అమిత్ షా.