F3 సెట్ లో పుష్పరాజ్ సందడి..ఫోటోలు వైరల్ !

-

విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఎఫ్ 2.. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ తరుణంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎఫ్ 2 సినిమాలోని హీరోయిన్ ల నే ఈ సినిమాలోనూ తీసుకున్నాడు అనిల్ రావిపూడి.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సడన్ గా సెట్ ను విజిట్ చేశాడు.. పుష్ప హీరో అల్లు అర్జున్. వరుణ్ తేజ్ తో పాటు పలువురు స్టార్ లతో కలిసి కాసేపు ముచ్చటించారు ఈ పుష్ప రాజ్.

దీనికి సంబంధించిన ఫోటోలను విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ సందేశ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఎఫ్ 3 సినిమా.. విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే విడుదల తేదీని ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news