కాకినాడ థియేటర్ లో “సీటీమార్” చూసిన అల్లు అర్జున్..!

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ కాకినాడ థియేటర్ లో సినిమా చూశారు. కాకినాడ పద్మ ప్రియ హాల్లో మ్యాట్ని షో చూసారు. గోపీచంద్ హీరోగా నటించిన సీటిమార్ సినిమాను బన్నీ వీక్షించారు. ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో పుష్ప సినిమా షూటిం

గ్ జరుగుతోంది. దాంతో షూటింగ్ కోసం కాకినాడ వచ్చిన అల్లు అర్జున్ కాలక్షేపం కోసం సినిమా కు వెళ్లారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సాయి ధరమ్ తేజ్ కు జరిగిన ప్రమాదం పై మీడియా ముందు స్పందించలేదు.

ఇక బన్నీ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాను సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది సినిమాలో మలయాళ నటుడు ఫాహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల కాగా ఎంతో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.