విద్యార్థులకు సిలబస్ గా కరోనా..!

-

ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కనుంది. పశ్చిమ బెంగాల్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థల్లో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాల్లో కరోనా కు సంబందించిన పాఠాలను బోధించనున్నారు. కరోనా లక్షణాలు, తిస్కోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స వంటి అంశాలను పాఠాల్లో చేరుస్తారు. కరోనా విషయం లో విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది.corona-virus

ఇక కరోనా ఎలాగూ మానవాళిని వదిలేలా కనిపించడం లేదు. మిగతా బ్యాక్టీరియా, వైరస్ ల మాదిరిగా ఎల్ల కాలం మనుషులపై పంజా విసిరెలా ఉంది. ఈ నేపథ్యంలో సిలబస్ లో చేర్చుకోవడం ద్వారా అయినా విద్యార్థుల కు కరోనా పై అవగాహన ఏర్పడి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వార్తల్లో రెండేళ్లుగా మోత మోగిపోయిన కరోనా వైరస్ సిలబస్ లో చేర్చుకోవడం వల్ల పరీక్షలు పెట్టినా విద్యార్థులు సాత్తా చాటే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news