అల్లు అర్జున్ పై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. అయినా పర్లేదంటూ..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐకాన్ స్టార్ గా మారి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవ్వడమే కాదు టాప్ టెన్ సెలబ్రిటీలలో ఒకరిగా దూసుకుపోతున్న ఈయన ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాతో మరొకసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా సాధారణంగా సినీ ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అల్లు అర్జున్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఆయన స్టైల్ , మేనియాకి ఫిదా అవుతుంటారు.

Allu Arjun adored the cute moments of Aishwarya Lekshmi with Tovino Thomas on the SIIMA stage - YouTube

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ లోకి కొత్తగా వచ్చే యంగ్ హీరోయిన్లు సైతం అల్లు అర్జున్ పై మోజు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అల్లు అర్జున్ పై తనకున్న కోరికలను బయటపెట్టేసింది. మట్టి కుస్తీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పేరు దక్కించుకున్న ఈమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో నటించింది. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో విషయాలను పంచుకుంది ఐశ్వర్య లక్ష్మి.

ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం.. అయితే ఆయనకు పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఏం పర్లేదు..నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.. అంటూ హాట్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే అల్లు అర్జున్ లో ఉండే స్పెషల్ టాలెంట్ కి తాను ఫిదా అయినట్టు.. అందుకే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్లు చేయగా.. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news