సురేఖ విషయంలో అలా చెప్పి బాధపడ్డ అల్లు రామలింగయ్య.. ఏమన్నారంటే..?

-

స్వయంకృషితో ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. 1979లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన తన జీవితంలో ఎన్నో అవమానాలు, సవాళ్ళను కూడా ఎదుర్కొని నేడు తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో చిరస్థాయిగా మెగాస్టార్ గా నిలిచిపోయారు. ఇప్పటికీ ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ తన స్టామినా ఏంటో నిరూపిస్తున్న ఈయన బాక్స్ ఆఫీస్ కింగ్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇంకా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోక ముందే ప్రముఖ హాస్యనటులు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేసిన వేళా విశేషం ఏమో కానీ క్రమంగా చిరంజీవికి సినిమాలలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. క్రమంగా ఆయన హీరోగా నిలదొక్కుకోవడం జరిగింది. సుప్రీం హీరోగా ఆ తర్వాత స్టార్ హీరోగా ఇప్పుడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ఇకపోతే చిరంజీవి, సురేఖల పెళ్లి జరిగేటప్పుడు అల్లు రామలింగయ్య చిరంజీవితో సురేఖ గురించి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారట.

“బాబూ నువ్వేమో కొంచెం స్పీడు.. కొంచెం దూకుడు కలిగిన మనిషివి. కానీ మా సురేఖ మాత్రం అలాంటిది కాదు.. మా ఇంట్లో భారతి, అరవింధ్, వసంత అందరూ కూడా ఉన్నది ఉన్నట్లే మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు.. కానీ సురేఖ మాత్రం చాలా నెమ్మదస్తురాలు. ఏ విషయాన్ని కూడా ఆమె బయటకు చెప్పుకునే టైప్ కాదు.. ఆమెను బాగా చూసుకోవాలయ్యా” అంటూ చిరంజీవికి చెబుతూ అల్లు రామలింగయ్య కంటతడి పెట్టుకున్నారట. ఇక మామకు ఇచ్చిన మాట ప్రకారం అల్లు రామలింగయ్య చెప్పినట్లుగానే సురేఖ ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news