బెగ్గింగ్ మాఫియాలో మరో కొత్తకోణం.. మహిళలు కూడా..!

-

బెగ్గింగ్ మాఫియా లో మరో  కొత్త కోణం చోటు చేసుకుంది. వీరు అమ్మ చేయూత ఫౌండేషన్ పేరిట భారీ వసూలు చేస్తున్నారు. అమ్మ చేయూత ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థను 2019లో గణేష్ అనే వ్యక్తి ఏర్పాటు  చేశారు.రోడ్డు.. కూడలి వద్ద అమ్మ చేయూత ఫౌండేషన్ పేరిట వసూలు చేస్తున్నారు. అమ్మ చేయూత ఫౌండేషన్ పేరిట  జనాలను ఇబ్బంది పెడుతూ డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్యాంగ్ లో పదిమంది గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వసూలు చేసిన డొనేషన్స్ ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నమ్మించి భారీ మొత్తంలో డొనేషన్స్ వసూలు చేశారు.

 ముఖ్యంగా  గణేష్ కు కేతావత్ రవి, మంగు అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు.. గణేష్ తో రవి, మంగు ఒప్పందం చేసుకున్నారు. ఈ  ఒప్పందంలో భాగంగా అమ్మ చేయూత ఫౌండేషన్ కలెక్షన్ బాక్స్ లోను ఏర్పాటు చేశారు. కలెక్షన్ బాక్స్ లను గణేష్ మంగు, రవికి అద్దెకు ఇచ్చాడు. అద్దెకిచ్చిన ఒక్కో బాక్స్ కు నెలకు  రూ. 2000 చొప్పున గణేష్ వసూలు చేశాడు. ఐదు నుండి పదిమంది మహిళలను ఎంపిక చేసుకొని వారికి కలెక్షన్ బాక్స్ లను మంగు రవి ఇచ్చారు. మహిళలకి వైట్ కోట్ లతో పాటు ఐడి కార్డులను కూడా ఇచ్చారు. ఇలా బాక్సులు తీసుకున్న వీరంతా జన సంచారం ఉన్న  ప్రాంతాల్లో అక్రమంగా డొనేషన్స్ వసూలు చేశారు. ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు ఎక్కువగా బెగ్గింగ్ చేస్తారు..రాత్రి 10 గంటలకు మంగు, రవి కలెక్షన్ బాక్స్ ను ఓపెన్ చేస్తారు . బెగ్గింగ్ చేసిన మహిళలు ఇద్దరు, అన్నదమ్ములు 50:50 పంచుకుంటారు. రెండు మూడు సంవత్సరాలుగా ఈ దందా ను నిందితులు కొనసాగిస్తూ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news