వీకెండ్ కూల్చివేతలు షురూ చేసింది హైడ్రా. ఈ తరుణంలోనే… హైదరాబాద్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే 90 శాతం నిర్మాణం పూర్తి అయిన భవనాన్ని కూల్చేస్తోంది హైడ్రా. ఈ వీడియో వైరల్ గా మారింది.
అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రా కు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్..అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారట. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించారట హైడ్రా కమిషనర్ రంగనాథ్..దీంతో వీకెండ్ కూల్చివేతలు షురూ చేసింది హైడ్రా.
బ్రేకింగ్ న్యూస్
వీకెండ్ కూల్చివేతలు షురూ చేసిన హైడ్రా
హైదరాబాద్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో భవనాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు
ఇప్పటికే 90 శాతం నిర్మాణం పూర్తి అయిన భవనాన్ని కూల్చేస్తున్న హైడ్రా pic.twitter.com/0QmYXYXV93
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025