అలోవెరా జ్యూస్ వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి…!

-

సాధారణంగా అలోవేరా మన ఇళ్లలోనే పెరుగుతుంటుంది. ఎక్కువ నీళ్లు దానికి లేక పోయినా మన ఇళ్ళల్లో పెరిగిపోతుంది. దీనిలో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని కాస్మోటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. కలబంద లో ఉండే గుజ్జు లో 96 శాతం నీటితోనే తయారవుతుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గాయాలను మాన్పించే గుణం కూడా అలోవెరా లో ఉంది.

చర్మాన్ని ఎంతో కోమలంగా మారుస్తుంది. కొబ్బరి నూనెతో కలిపి అలోవెరా గుజ్జును తలకు రాసుకుంటే జుట్టు రిపేర్ అయిపోతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. మృతకణాలు కూడా తొలగి పోతాయి. హై బీపీ ని కూడా తగ్గించడానికి అలోవెరా ఉపయోగ పడుతుంది. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల లివర్ ఫంక్షన్ బాగుంటుంది. లివర్ ఆరోగ్యానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

అలోవెరా జ్యూస్ లో ఫీతో న్యూట్రిఎంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనితో ఇది మంచిగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి కూడా బయట పడొచ్చు అలోవెరా జ్యూస్ లో క్యాల్షియం, కాపర్, క్రోమియం, సోడియం సెలీనియం వంటివి ఉంటాయి.

దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పైగా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ దీనిలో ఉంటాయి మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది జబ్బులు రాకుండా ఉండడానికి కూడా ఉపయోగ పడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటివి వచ్చినా కూడా ఇది తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ అయిపోకుండా కూడా అలోవెరా ఉంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలానే మేలు కలుగుతుంది అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version