వెస్టిండీస్ తో టీమిండియా టీ 20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ముందుంది. నేడు రెండో టీ 20 జరగనుంది. కాగ ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరం అయితే.. బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నెట్స్ లో ప్రాక్టిస్ చేస్తున్నప్పుడు.. బౌలింగ్ కోసం మెలకువలు నెర్చుకుంటున్నాని అన్నారు.
బౌలింగ్ చేయుమని కెప్టెన్ అంటే.. తప్పక చేస్తానని అన్నారు. అలాగే ప్రస్తుతం ఫినిషర్ పాత్రను ఎంజాయ్ చేస్తున్నానని సూర్య కుమార్ యాదవ్ అన్నాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో చివరి వరకు క్రీజ్ లోనే ఉండాలని అనుకుంటానని అన్నారు. అందుకు అనుగూణంగా బ్యాటింగ్ చేస్తానని అన్నారు. అలాగే మొదటి టీ 20 మ్యాచ్ లో వెంకటేశ్ అయ్యార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నారు. అతని సహకారంతోనే మ్యాచ్ గెలిచామని అన్నారు. కాగ వెస్టిండీస్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో సూర్య కుమర్ యాదవ్ 34, వెంకటేశ్ అయ్యార్ పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.