నిన్నటి వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన్రోజు వేడుకలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియాలోనూ జరిగాయి.ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. యువ ఎంపీ రామూతో సహా అనేకమంది టీడీపీ తో పాటు వైసీపీ నాయకులు కూడా అభినందనలు అందించారు. దేశ రాజకీయాల్లో ఆయన దూసుకుపోవాలని కూడా కాంక్షించారు. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే టీడీపీ నుంచి మంచి మద్దతు ఉండడం ఖాయం. ఎందుకంటే ఆయనకు ఇక్కడి పరిణామాలపై మంచి పట్టు ఉంది.ఇక్కడి ఉద్యమంపై కూడా మంచి పట్టు ఉంది. కనుక టీడీపీ సాయంతో కేసీఆర్ ఎదిగి వచ్చేందుకు ఉద్యమాల ఖిల్లా శ్రీకాకుళం జిల్లా ఎంతగానో సహకరించనుంది.
కొత్త వారిని ముఖ్యంగా మార్పును కోరుకునే శ్రీకాకుళంలాంటి ప్రాంతాల నుంచే ఎవ్వరైనా రాజకీయం ప్రారంభించాలని భావిస్తారు.ఆ విధంగా తూరుపు వాకిట కేసీఆర్ మంచి ఫలితాలు అందుకోనున్నారు. ఇక వైసీపీ ఎలానూ బీజేపీతో స్నేహ బంధం నేరుగా కాకుండా పరోక్ష రీతిలో కొనసాగిస్తుంది కనుక
ఆ బంధాలకు మరికొంత బలం చేకూర్చేవిధంగా రేపటి వేళ మోడీ – షా ద్వయం జగన్ కు మరింత ప్రాధాన్యం ఇవ్వడం ఖాయం.ఆఖరి నిమిషంలో జగన్ కు సానుకూలంగా ఉండేందుకు,రాజకీయంగా ఊతమిచ్చేందుకు ప్రత్యేక హోదా ప్రకటించి కొన్ని అంశాలపై క్లారిటీ ఇస్తూ ప్రకటన చేసే అవకాశాలూ కొట్టిపారేయలేం.
వాస్తవానికి జగన్ ను ఢీ కొనేందుకు చంద్రబాబుకు ఉన్న శక్తి చాలడం లేదు.ఆ రోజు జగన్ ఎదుగుదల కేసీఆర్ ఏ విధంగా సాయం చేశారో,ఇప్పుడు చంద్రబాబు ఎదుగుదలకు కేసీఆర్ అదే స్థాయిలో అదే రీతిలో సాయం చేయనున్నారు అన్నది తథ్యం.ఎలానూ శ్రీకాకుళంలాంటి ప్రాంతాలలో టీడీపీ బలహీనంగా ఉంది కనుక ఇక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించి తరువాత విజయ తీరాలకు చేరుకోవచ్చు అన్నది కూడా కేసీఆర్ కు కలిసివచ్చే అంశం కావొచ్చు.ఇదే రేపటి వేళ ఆయన ప్రథమ ప్రాధాన్యం కూడా!కావొచ్చు. మే ఆర్ మే నాట్ ఇట్స్ వెరీ హైపోథిటికల్ ..!