బ్రహ్మానందం ఇంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్షం … !

-

దేశాన్ని మాత్రమే కాదు విదేశాలలో సైతం తన సత్తా చాటిన చిత్రం పుష్పకు నిన్న జాతీయ అవార్డు లలో అల్లు అర్జున్ ఉత్తమ్ హీరోగా గెలుపొందిన విషయం తెలిసిందే. దేశమంతా ఇతన్ని నిన్న పొగడ్తలతో ముంచెత్తింది, కాగా నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఈ రోజు బ్రహ్మానందం ఇంట్లో ప్రత్యక్షము అయ్యాడు. అయితే ఎందుకు బన్నీ బ్రహ్మి ఇంటికెళ్ళాడు అన్న విషయంలో కొందరికి సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం గత వారంలో బ్రహ్మానందం కుమారుడికి వివాహం జరుగగా, అందుకు అల్లు అర్జున్ కొన్ని పనుల కారణంగా హాజరు కాకపోవడంతో … ఈ రోజు వచ్చి కలిసి వారికి శుభాకాంక్షలు తెలియచేశాడు. ఇక ఈ ఇంట్లో అల్లు అర్జున్ గంటన్నర సేపు వారితో ముచ్చటించారు. అనంతరం బ్రహ్మనందం అల్లు అర్జున్ ను సత్కరించారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news