బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రకటించపోవడంతో తుమ్మల ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఖమ్మంలో తాజాగా మీడియాతో మాట్లాడారు తుమ్మల నాగేశ్వరరావు. భారీ కాన్వాయ్ తో ఖమ్మం చేరుకున్నారు. ఖమ్మం జిల్లా కోసం 45 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి నేను.. మీ బిడ్డగా ఈ జిల్లాకు 10 నియోజకవర్గాల్లో శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకు.. అందరికంటే మిన్నుగా జిల్లా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలని.. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఉన్న ప్రభుత్వ సహకారంతో నా జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు.
ఎన్నికలు అవసరం లేదు.. రాజకీయాలకు స్వస్తీ చెప్పాను. నా రాజకీయ పదవీ నా కోసం సుఖవంతమైనటువంటి జీవితం గడపడం కోసమే రాజకీయ జీవితం.రాజకీయాలకు స్వస్తీ చెబుతున్నానని సీఎం కేసీఆర్ కి చెప్పాను అని గుర్తు చేశారు. తప్పకుండా గోదావరి జలాలతో మీ పాదాలను కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏం చేసినా ఖమ్మం అభివృద్ధి కోసమే అని చెప్పారు. నా శిరస్సు నరుక్కుంటా తప్ప నా వల్ల ఎవ్వరూ తలదించుకోవద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తుమ్మల నాగేశ్వరరావు.