ఇద్దరమ్మాయిలు సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైన హీరోయిన్ అమలాపాల్. ఆ సినిమా తర్వాత వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా రఘువరన్ బీటెక్ సినిమాతో సౌత్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన నాయక్ సినిమాలో చేసే అవకాశం దక్కించుకుంది. అయితే తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొంతకాలానికే విజయ్ తో విడిపోయింది. విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది….
తన బాయ్ ఫ్రెండ్ భవిందర్ సింగ్ ను అమలాపాల్ సీక్రెట్ గానే పెళ్లి చేసుకుంది. అయితే ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తొలుత ఈ ఫోటోలను భవీందర్ సింగ్ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేయగా కొద్ది సేపటికే వాటిని డిలీట్ చేశాడు. కాకపోతే అప్పటికే ఆ ఫోటోలు వైరల్ నెట్టింట్లో వైరల్ అయిపోయాయి.
అయితే ఇప్పటి వరకూ కూడా వీరి పెళ్లిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెట్టింట్లో ఫొటోలు వైరల్ అయిన నేపథ్యంలో త్వరలోనే వీరి పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.