ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఆ రోజు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. మరి ఆ రోజు ప్రజలు అందరూ ఎం చెయ్యాలి…? ఆ రోజు అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మనలోకం పలు సూచనలు చేస్తుంది.
1. శనివారం నాడు రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి. 2. రెండు రోజులకి సరిపడా కూర గాయాలు కొనుక్కుని పెట్టుకోండి. 3. అవసరమైన మందులు ఉన్నాయో లేదో చూసుకుని అవి శనివారమే తెచ్చి పెట్టుకోవడం మంచిది. 4. పిల్లలకి కావలసిన స్నాక్స్ ముందే తెచ్చి పెట్టుకోవాదం మంచిది. 5. ఆదివారం చేద్దాం అనుకున్న పనులు పక్కాగా వాయిదా వేసుకోవడం అనేది మంచిది.
6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకుండా ఉంటే మంచిది. 7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చేసుకోండి. 9. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే ఆ రోజు వాషింగ్ చేసుకోండి. 10. బయట నుండి ఫుడ్ ఆర్డర్ అసలు ఇవ్వొద్దు. 11) 22 వ తేదీ నాడు ఇంట్లో ఉన్న టీవీ రిమోట్, ఏసీ రిమోట్, లైటర్, డోర్ నాబ్స్, డోర్ హ్యాన్దిల్స్, డోర్ ల్యాచేస్, మీరు వాడే bike లు, వాట్చ్ స్త్రిప్స్, బండి తాళాలు,
అవి అన్ని కూడా డెటాల్ కలిపినా నీళ్ళతో కడుక్కోవడం మంచిది, 13) బైక్ లు కూడా వీలయితే డెటాల్ కలిపిన నీళ్ళతో ఇంట్లోనే కడగండి. 15) సరిగ్గా 5.00PM కు మీ ఇంటి గేటు వద్ద నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి. 16) మోడీ తెలిపిన జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి.