చ‌నిపోతాం అంటూ.. రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖలు

-

ఏపీ మూడు రాజ‌ధానుల విష‌యంలో రైతులు, మహిళలు, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను, జీఎన్‌రావు కమిటీ నివేదికను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ అమరావతి రైతులు లేఖలు రాశారు. కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ లేఖలు రాశారు. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని తెలిపారు.

కేవలం ముఖ్యమంత్రి , పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకున్నవారు లేరని లేఖలో పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో తమ పల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని… ఈ బతుకులు మాకొద్దని లేఖలో విన్నవించారు. ఇక మాకు మరణమే శరణ్యమని అన్నారు. తమ మీద దయతో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news