అమరావతిలో ఊపందుకున్న రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌

-

అమరావతి: సీఆర్డీయే ఆధ్వర్వంలో అమరావతిలో నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నేలపాడు వద్ద చేపట్టే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా జీప్లస్‌ 18 పద్ధతిలో నిర్మించే 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని సీఆర్‌డీఏ కల్పించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే వారికి సహాయపడేందుకు విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లక్ష మందికిపైగా సర్వర్‌తో అనుసంధానం కావడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో మొదటి గంటలో కేవలం 72 ఫ్లాట్లు మాత్రమే బుక్‌ అయ్యాయి. సాయంత్రానికి 300 ప్లాట్లు బుక్ చేసుకున్న‌ట్లు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. తొలిదశలో బుకింగ్‌లు పూర్తయిన వెంటనే మరో 300 ఫ్లాట్ల బుకింగ్‌ చేపట్టేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. ఆ త‌రువాత డిమాండ్‌ను బ‌ట్టి మ‌రో 300 ప్లాట్ల‌ను నిర్మించాల‌నుకుంటున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version