ఇది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్!

-

చైనా మరో మెట్టు పైకి ఎక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఓ న్యూస్ యాంకర్‌ను సృష్టించి రికార్డు క్రియేట్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు.. కృత్రియ మేధస్సు. అంటే మనిషి అవసరం లేకుండా… మనిషి లాగా ఆలోచించే మిషన్లు అన్నమాట. అవి మనిషి కన్నా వందరెట్లు తెలివిగా ఆలోచించగలవు. రాను రాను మనిషి అవసరమే లేకుండా పోయేట్టుంది దీన్ని చూస్తుంటే. చైనా చానెల్ జినువా ఈ ఏఐ యాంకర్లను ప్రారంభించింది. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఈ ఏఐ యాంకర్లు ప్రజలకు చేరవేరుస్తారు. జినువా న్యూస్ యాంకర్ రెప్లికా రోబోను తయారు చేసి.. దానికి ఏఐ ప్రోగ్రామ్స్ ఎంబెడ్ చేశారు. ఇక.. ఈ ఏఐ యాంకర్ అచ్చం నిజమైన యాంకర్ మాట్లాడినట్టే మాట్లాడుతుంది. ఏ మాత్రం డౌట్ రాదు. సడెన్‌గా చూస్తే ఇది నిజంగా రోబోనేనా లేక మనిషా అన్నట్టుగా ఉంటుంది. కావాలంటే మీరూ ఓసారి లుక్కేసుకోండి ఆ వీడియోపై.

Read more RELATED
Recommended to you

Exit mobile version