జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఎన్నికలకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి అభ్యర్థులు తొలి జాబితా ని టీడీపీ, చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 118 సీట్లకి అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. వీళ్ళలో ఐదుగురు జనసేన అభ్యర్థులు కాక మిగిలిన సీట్లకి టిడిపి అభ్యర్థుల్ని ఖరారు చూశారు మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు.
తుప్పు పట్టిన సైకిల్ పగిలిపోయిన గ్లాసుకి గోల్డ్ కోటింగ్ వేసి ప్రజల ముందుకి తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తొలి జాబితాలో జనసేన టిడిపి బలహీనతలు బయట పడ్డాయని అన్నారు. విశాఖలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు వైయస్ జగన్ చేసిన పాలన సంక్షేమ పథకాలను చూసి ఓటేయమని అడుగుతున్నాం కానీ పొత్తును చూసి ఓటు వేయాలని అడుగుతున్నాయి పార్టీలని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెండవసారి అధికారంలోకి తీసుకువస్తారని బలంగా నమ్ముతున్నామని అన్నారు.