హువామీ కార్పొరేషన్ కంపెనీ భారత్‌లో అమేజ్‌ఫిట్ టి-రెక్స్ పేరిట ఓ నూతన మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. అమెజాన్, అమేజ్‌ఫిట్ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ వాచ్ లభిస్తోంది. రాక్ బ్లాక్, కేమో గ్రీన్, ఖాకీ, ఆర్మీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్ తదితర ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ ఈ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
టి-రెక్స్ స్మార్ట్‌వాచ్‌లో 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 20 రోజుల వరకు స్టాండ్ బైలో ఉంటుంది. 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ లభిస్తోంది. బయోట్రాకర్ పీపీజీ ఆప్టికల్ సెన్సార్‌ను ఏర్పాటు చేసినందున నిరంతరాయంగా హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. అలాగే హార్ట్ రేట్ పెరిగినప్పుడు అలర్ట్ వచ్చేలా ఈ వాచ్‌లో సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.
అమేజ్‌ఫిట్ టి-రెక్స్ స్పెసిఫికేషన్లు…
* 1.3 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్
* ఆండ్రాయిడ్ 5.0 ఆపైన, ఐఓఎస్ 10.0 ఆపైన వెర్షన్లు ఉన్న డివైస్‌లకు కనెక్టివిటీ
* వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 14 రకాల స్పోర్ట్స్ మోడ్స్
* 390 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
అమేజ్‌ఫిట్ టి-రెక్స్ స్మార్ట్‌వాచ్‌ను రూ.9,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.