మొబైల్ గేమ్స్ ఆడేవారికి అమెజాన్ ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ బెనిఫిట్స్‌..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న ప్రైమ్ మెంబ‌ర్ల‌కు కొత్త‌గా ఎక్స్‌క్లూజివ్ గేమ్స్ కంటెంట్‌ను అందిస్తోంది. ప్రైమ్ మెంబ‌ర్లు ఇప్పుడు త‌మ మెంబ‌ర్‌షిప్ ద్వారా ప‌లు ర‌కాల మొబైల్ గేమ్స్‌కు గాను ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను పొంద‌వ‌చ్చు. ఈ మేర‌కు అమెజాన్ బుధ‌వారం వివ‌రాల‌ను వెల్ల‌డించింది. కేవ‌లం అమెజాన్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ఎక్స్‌క్లూజివ్ గేమింగ్ కంటెంట్ అందుబాటులో ఉంటుంద‌‌ని అమెజాన్ తెలియ‌జేసింది.

amazin gives exclusive benefits to its prime gaming customers

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు అకౌంట్‌లోకి లాగిన్ అయి ప‌లు ర‌కాల భిన్న‌మైన గేమ్స్‌కు చెందిన కంటెంట్ గురించి తెలుసుకోవ‌చ్చు. వ‌ర‌ల్డ్ క్రికెట్ చాంపియ‌న్‌షిప్ 2, మాఫియా సిటీ, మొబైల్ లెజెండ్స్‌: బ్యాంగ్ బ్యాంగ్‌, వ‌ర‌ల్డ్స్ విత్ ఫ్రెండ్స్ 2 త‌దిత‌ర ప‌లు ర‌కాల గేమ్స్‌కు ప్ర‌స్తుతం ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు. ఇక త్వ‌ర‌లోనే లూడో గేమ్స్‌కు కూడా ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో భాగంగా కంటెంట్‌ను అందివ్వ‌నున్నారు.

కాగా లాంచింగ్ కింద ఆయా గేమ్స్‌కు చెందిన ప‌లు ర‌కాల ఐట‌మ్స్‌ను ప్రైమ్ మెంబ‌ర్లు ప్ర‌స్తుతం ఉచితంగా పొంద‌వచ్చు. వాటిని ఆయా గేమ్స్ ఆడేట‌ప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక త్వ‌ర‌లోనే మ‌రిన్ని గేమ్స్‌కు కంటెంట్‌ను ప్రైమ్ మెంబ‌ర్ల‌కు అమెజాన్ అందుబాటులోకి తేనుంది. ఇక అమెజాన్ ప్రైమ్ గేమింగ్ బెనిఫిట్స్ పొందేందుకు యూజ‌ర్లు స‌ద‌రు గేమ్‌ను యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. అనంత‌రం గేమ్‌లో అమెజాన్ ప్రైమ్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. దీంతో ప్రైమ్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news