ఇరవై పైసలకి టీషర్ట్ – దిమ్మ తిరిగిపోయే ఆఫర్ ఇది !!

-

కొత్త ఏడాది సందర్భంగా అనేక వ్యాపార సంస్థలు కస్టమర్లని ఆకర్షించడం కోసం అనేక ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ లేకపోతే టు ప్లస్ త్రీ ఆఫర్ అని కస్టమర్లను ఆకర్షించడానికి కోసం అనేక వ్యాపార సంస్థలు కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో ఓ షాపు ఓనర్ ఇచ్చిన ఆఫర్ సోషల్ మీడియాలో మరియు తమిళనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో హైలెట్ న్యూస్ గా నిలిచింది.

మేటర్ ఏమిటంటే తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో ఓ దుస్తుల దుకాణుదారుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద తన దుకాణంలో రూ.300 విలువ చేసే టీషర్టును చలామణిలో లేని 20 పైసల నాణేలకు అందిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ దుకాణం ముందు ప్రజలు తండోపతండాలుగా క్యూ కట్టడం జరిగింది.

ఇటువంటి నేపథ్యంలో వచ్చిన మొదటి వంద మందికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని చెప్పటంతో చాలా మంది అప్పటికే లేటుగా జనాలు వచ్చిన తరుణంలో వచ్చిన జనాలు నిరాశగా మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. మొత్తంమీద కొత్త ఏడాది రోజు ఆ షాపు ఓనర్ ఆఫర్ ఇచ్చిన దానికి చాలామంది న్యూ ఇయర్ మొదటి రోజు ఇలా ఉసూరు అనిపించడం ఏమిటి అని కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news