అలసటని దూరం చేసే అద్భుతమైన చిట్కాలు…

-

రోజంతా పనిచేసి అలసిపోవడం వేరు. కొంత పని చేయగానే ఇక చేయాలనిపించక ఆసక్తి కోల్పోయి అలసిపోవడం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. మొదటి దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే శరీరం అలసిపోయింది కాబట్టి, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పునరుత్తేజం పొందవచ్చు. కానీ రెండవ దానికి అలా కాదు. ఏ పని చేద్దామన్న ఆలోచన వచ్చినా దానికన్నా ముందే అలసట భావం గుర్తొస్తూ ఉంటుంది. ఆ అలసటని పోగొట్టుకుని రోజంతా పనిచేస్తూ రాత్రయ్యే సరికి హాయిగా నిద్రపోయే అద్భుతమైన చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఐదు నిమిషాలకోసారి అలారం కట్టేయడం ఆపేయాలి. స్నూజింగ్ మంచిది కాదు. దానివల్ల నిద్ర సరిగ్గా ఉండక మెదడు మీద ప్రభావం చూపుతుంది. అలారం ఆఫ్ చేసాక మళ్ళీ ఐదు నిమిషాలకి అలారం మోగుతుందన్న ఆలోచన మెదడులోకి వచ్చి నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుంది.

పొద్దున్న లేవగానే అలసట అనిపిస్తే ఖచ్చితంగా ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగండి. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నట్లయితే అలసటగా అనిపిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పొద్దున్న పొద్దున్న కడుపంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. దానివల్ల జీవక్రియ సరిగ్గ జరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ చేసేటపుడు చక్కెర సంబంధిత పదార్థాలు తీసుకోకూడదు. రోజులో మొదటిపూట భోజనం తీసుకునేటపుడు చక్కెరని వ్యతిరేకించడమే బెటర్.

ప్రతిరోజూ సూర్య కిరణాలు పడేలా బయట తిరగండి. కిరణాల్లో ఉండే విటమిన్ డి మిమ్మల్ని ఉత్తేజాన్ని పెంచుతుంది. అంతేకాదు ఏదో కొత్త ఉత్సాహం నిండినట్లు అనిపిస్తుంది.

కాఫీ అతిగా తాగవద్దు. అందులో ఉండే కెఫైన్ ఉత్తేజపరిచే మాట నిజమే కానీ, ఎక్కువగా తీసుకుంటే అలసటకి దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version