పండుగలు వచ్చిందంటే చాలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లతో జోరుగా ప్రచారం సాగిస్తుంటాయి. అయితే దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు వివిధ ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ పండుగ సీజన్‌లో పోటాపోటీగా భారీ సేల్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ సేల్స్‌కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. ఈనెల 23వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival), ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సేల్ మొదలుకానుంది.
ఇక ప్రైమ్ మెంబర్స్‌కు అమెజాన్‌లో, ప్లస్ మెంబర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో 22నే అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, ఇయర్‌ఫోన్స్ సహా మరిన్ని ప్రొడక్టులు కొనాలనుకునే వారు ఈ సేల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఏ సమయానికి మొదలవుతాయి.. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు ఎలా ఉంటాయి.. డీల్స్ ఎలా ఉన్నాయనే పూర్తి సమాచారం ఇదే.
Amazon Great India Festival : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈనెల 23వ తేదీన సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటలకు ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అంటే 22వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకే ప్రారంభమవుతుంది.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా ఈనెల 23న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే అంటే 22వ తేదీనే సేల్ మొదలవుతుంది. సాధారణ యూజర్లకు 23న అందుబాటులోకి వస్తుంది.