ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అక్టోబర్‌లో పండుగ సీజన్ సమీపిస్తోంది. జనాలు ఇప్పటికే షాపింగ్‌ల పేరిట మార్కెట్‌లలో ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్స్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెజాన్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సన్నాహాలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సైట్లు పండుగ సీజన్ లో వినియోగదారులకు భారీ రాయితీలను, ఆకట్టుకునే ఆఫర్లను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే ఈ రెండు సేల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యేది వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ అక్టోబర్ 2వ వారంలో సేల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ అందిస్తారు. అలాగే ప్రైమ్ మెంబర్లకు కొంత సమయం ముందుగానే సేల్ అందుబాటులోకి వస్తుంది. ఇక ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 70 శాతం వరకు రాయితీలను అందించనున్నారు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డ్ తోనూ వస్తువులను కొనుగోలు చేసే సౌకర్యం కల్పించనున్నారు. గతంలో ఎన్నడూ ఇవ్వని భారీ రాయితీలను మొబైల్స్, యాక్ససరీలపై అమెజాన్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇవే కాకుండా వినియోగదారులు తాము కొనే ఫోన్లకు టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా అమెజాన్ అందించేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు ఫ్లిప్ కార్ట్ ఎస్‌బీఐతో భాగస్వామ్యం అయింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పాల్గొనే వారికి ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభ్యం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు సేల్ కొంత ముందుగానే అందుబాటులోకి వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయంతోపాటు బజాజా్ ఈఎంఐ కార్డుతో వస్తువులను కొనే సదుపాయం కూడా అందిస్తారు. పేటీఎం బ్యాంక్ అకౌంట్ లేదా వాలెట్ నుంచి వస్తువులను కొనుగోలు చేస్తే తప్పనిసరిగా క్యాష్ బ్యాక్ అందిస్తారు. కేవలం రూ.1కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, టీవీలు, అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు తగ్గింపును అందివ్వనున్నారు. ఇక సేల్స్ ప్రారంభమయ్యే తేదీలను ప్రకటిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.