ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. తాజాగా గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు అమెజాన్ శ్రీకారం చుట్టింది. గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం అమెజాన్ తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్ఈ) పేరుతో గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది.
దీని ద్వారా గ్రామీణ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ విద్యను ఇస్తారు. అదే విధంగా భవిష్యత్తులో వారు మెరుగైన ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అమెజాన్ అనుకుంటోంది. ఏడు రాష్ట్రాల్లోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 1 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌లో అవకాశంని కలిపిస్తారు. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు.
అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో 6 నుంచి 12 తరగతి విద్యార్థులకు సైన్స్ ఎడ్యుకేషన్‌పై బోధన ఉంటుంది. అలానే కోడింగ్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్లాంటివి బోధిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు అమెజాన్ సైబర్ రోబోటిక్స్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్స్, కోడింగ్ నేర్చుకో వచ్చు.
భారత గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ నేర్పించేందుకు అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్నర్ కోడ్.ఓఆర్జీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది. అయితే నేటి ఉపాధి రంగంలో కంప్యూటర్ సైన్స్ కీలకంగా మారింది. అందుకే కంప్యూటర్ సైన్స్‌పై పాఠశాల స్థాయిలోనే పట్టు సాధించడం అవసరమని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ అన్నారు.