Chiranjeevi Pawan Kalyan:రేపు చిరు, ప‌వ‌న్‌ల రాజమండ్రి పర్యటన.. కార‌ణ‌మ‌దేనా!

-

Chiranjeevi Pawan Kalyan: మెగా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్. శుక్రవారం రాజమండ్రిలో ప‌ర్యాటించ‌నున్నారు. ప‌ట్ట‌ణంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలను సంద‌ర్శించ‌నున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ క‌ళాశాల ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి, ప‌వ‌న్‌ల‌కు భారీ ఎత్తున ఘనస్వాగతం చెప్పేందుకు అభిమానులు రానున్నారు. దీంతో ఏపీ పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఈ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతుంది. ఈ స‌భ‌లో చిరు, ప‌వ‌న్‌లు ఏలాంటి వ్యాఖ్య‌లు చేస్తారని ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 2న రాజమండ్రిలో పవన్ క‌ళ్యాన్ మరో మారు ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఇప్పటికే ఈ ప‌ర్య‌ట‌న కోసం జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత కల్పించాలని కోరారు. చిరు, పవన్ వరుస పర్యటనల నేపథ్యంలో జిల్లా రాజ‌కీయాల్లో అటు ఫ్యాన్స్‌లో సంద‌డి నెల‌కుంది.

Read more RELATED
Recommended to you

Latest news