అమెజాన్‌లో గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ గిఫ్టింగ్ హ్యాపినెస్ డేస్‌ సేల్ షురూ

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివ‌ల్ గిఫ్టింగ్ హ్యాపినెస్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా న‌వంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, యాక్స‌స‌రీలు, ఎల్ఈడీ టీవీలు, వియ‌ర‌బుల్స్ తదిత‌ర అనేక ఉత్ప‌త్తుల‌పై 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

Amazon Great Indian Festival Gifting Happiness Days Sale started

సేల్‌లో యాపిల్ ఐఫోన్ 11కు చెందిన 64జీబీ వేరియెంట్ ను రూ.రూ.4901 తగ్గింపుతో రూ.49,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్‌, వ‌న్‌ప్ల‌స్ 8, ఎంఐ 10, గెలాక్సీ ఎస్‌10, వ‌న్‌ప్ల‌స్ 7టి ప్రొ, 7టి, గెలాక్సీ ఎం51, గెలాక్సీ ఎం31ఎస్‌, రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్‌, గెలాక్సీ ఎం31, రెడ్‌మీ నోట్ 9 ప్రొ, నోకియా 5.3, రెడ్‌మీ 8ఎ డ్యుయ‌ల్ ఫోన్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో ట్యాబ్లెట్‌ల‌పై 45 శాతం వ‌ర‌కు త‌గ్గింపును పొంద‌వ‌చ్చు. ల్యాప్‌టాప్‌ల‌పై రూ.30వేల వ‌ర‌కు, గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌పై రూ.35వేల వ‌ర‌కు, టీవీల‌పై 65 శాతం వ‌ర‌కు ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌పై 80 శాతం వ‌ర‌కు, హెడ్‌ఫోన్స్ పై 75 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఇయ‌ర్ బ‌డ్స్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్‌, సౌండ్ బార్స్‌, స్టోరేజ్ డివైసెస్‌, మానిట‌ర్స్‌, స్మార్ట్ వాచ్‌ల‌పై కూడా ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

సేల్‌లో భాగంగా సిటీ, ఐసీఐసీఐ, కోట‌క్ బ్యాంక్‌ల‌కు చెందిన కార్డులు ఉన్న‌వారు వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే వాటిపై అద‌నంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.