బీహర్ ప్రచారానికి వెళ్లిన ఆ హీరోయిన్ రేప్ నుంచి తప్పించుకుందా…?

-

ఎన్నికల ప్రచారంలో సినీ తారలకు ఉండే క్రేజే వేరు. దీన్ని క్యాష్‌ క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాయ్. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అలా.. ప్రచారానికి వెళ్లిన తనకు భయానక అనుభవం ఎదురైందట. తృటిలో రేప్, హత్య నుంచి తప్పించుకుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

ఓబ్రా నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రకాశ్ చంద్రపై సంచలన ఆరోపణలు చేసింది నటి అమీషా పటేల్‌. ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారానికి వెళ్లగా.. భయానక అనుభవం ఎదురైందని వివరించింది అమీషా పటేల్‌. తనను రేప్‌ చేసి చంపేసేవారేమోనని.. ఇప్పుడు కూడా బెదిరింపులు కొనసాగుతున్నాయని చెప్పింది.

అసలు విషయం ఏంటంటే..ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ప్రకాశ్ చంద్ర.. అమిషా పటేల్‌ను సంప్రదించారు. ఆమె బీహార్‌లో ప్రచారం కూడా చేసింది. చివరి రోజైన 26న ప్రచారం కోసమని అతని అనుచరులు అమిషా పటేల్‌ను ఓ గ్రామానికి తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రమే ముంబైకి రిటన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్నా, తనను కదలనీయలేదని అమిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది. కారులో వెళ్లనీయకుండా.. ఓ ఇంట్లో బంధించారని, రాత్రికి అక్కడే ఉండాలని, కాసేపట్లో వచ్చేస్తానని ప్రకాశ్ చంద్ర ఫోన్లోనే బెదిరించారని తెలిపిందామె. ఒక నేతలా కాకుండా అచ్చమైన రౌడీ లాగా అతను వ్యవహరించాడని ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news