తెలుగులో అమెజాన్‌..

-

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.ఇన్ తెలుగు వినియోగ‌దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో భాషాప‌ర‌మైన అడ్డంకుల‌ను తొలిగిస్తూ ఈ పోర్టల్‌లో ఇక నుంచి తెలుగులోనూ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళంలోనూ ఈ పోర్ట‌ల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ పోర్టల్‌ ఇంగ్లిష్, హిందీలో సేవలు అందిస్తోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కస్టమర్లకు భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యాప్స్, మొబైల్, డెస్క్‌టాప్‌ సైట్స్‌లో వినియోగదార్లు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. కస్టమర్‌ సర్వీసు సిబ్బందితో తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళంలో మాట్లాడవచ్చు. రానున్న పండుగల సీజన్లో మరో 20 నుంచి 30 కోట్ల మంది వినియోగదార్లను చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుందని వివరించింది. కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్లను తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్లు, చెల్లింపులు జరప‌డం సుల‌భం అవుతుంద‌ని అమెజాన్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తెలిపారు. నాలుగు భాషల చేరిక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news